Wednesday 20 January 2021

Amaravati - Capital - Insider Trading Case - AP High Court

 Jan 20 2021 @ 02:26AMహోంఆంధ్రప్రదేశ్రా

రాజధానిలో ఎక్కడుంది రహస్యం!?

ప్రపంచం మొత్తం తెలిశాక ‘ఇన్‌సైడర్‌’ ఇంకెక్కడ?


హైకోర్టు సూటి ప్రశ్న..  ‘ఇన్‌సైడర్‌’ వాదనలు కొట్టివేత


రాజధాని అమరావతిపై హైకోర్టు సంచలన తీర్పు


ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రాంతంపై ప్రకటన


ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు, కథనాలు


ఆస్తులు సమకూర్చుకోవడం రాజ్యాంగబద్ధ హక్కు


భూములు కొనడం నేరం, మోసం ఎలా అవుతుంది?


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కంపెనీలకు సంబంధించినది


ఐపీసీ సెక్షన్లతో దానికి సంబంధమే లేదు


పిటిషనర్లపై సీఐడీ కేసు చెల్లనే చెల్లదు: హైకోర్టు




అందరికీ తెలిసిందే!


రాజధాని ఏర్పాటుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో వస్తూనే  ఉన్నాయి. ఇది కేవలం కొందరు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు మాత్రమే తెలిసిన ‘రహస్య సమాచారం’ కాదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాజధాని ప్రాంతం గురించిన ప్రకటన వెలువడింది. అందువల్ల... పిటిషనర్లు మరేదో మార్గంలో ఈ సమాచారం పొందారని, భూవిక్రేతలకు రాజధానికి సంబంధించిన సమాచారం తెలియదని ఎంతమాత్రం భావించలేం. పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా ఈ విషయం మొత్తం ప్రపంచానికే తెలుసు. ఈ కథనాలను ‘ప్రాసిక్యూషన్‌’ కూడా తోసిపుచ్చలేదు. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయం రహస్యం కాదని... ప్రజలకు తెలుస్తూనే ఉందనేందుకు ఇవి తిరుగులేని ఆధారాలు.




ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. వర్తించదు


కంపెనీల అంతర్గత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వాటి షేర్లు, బాండ్ల ‘ట్రేడింగ్‌’ చేయడం చట్ట విరుద్ధం. దీనినే  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ఇది పూర్తిగా కంపెనీలు, షేర్‌ మార్కెట్లకు సంబంధించిన విషయం. భూములు, ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాలకు దీంతో సంబంధమే లేదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో ఐపీసీ నిబంధనలకు సంబంధమే లేదు. పిటిషనర్లకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను వర్తింపజేయడం తప్పు.




ఆస్తి... అందరి హక్కు


ఆస్తి హక్కు... రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. ఇది చట్టబద్ధమైన హక్కు.  దీని ప్రకారం దేశంలోని పౌరులు ఎవరైనా, ఎక్కడైనా భూములను కొనుగోలు చేయవచ్చు. ఆస్తులు సమకూర్చుకోవడం నేరం కానేకాదు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారంటూ క్రిమినల్‌ లా కింద చర్యలు తీసుకోలేరు. ప్రైవేటు భూలావాదేవీలు ఎలా నేరపూరితమవుతాయో... భూమిని కొన్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుని, వారిని ప్రాసిక్యూట్‌ చేయడం ఏమిటో కోర్టు అవగాహనకు అందడంలేదు. 


- హైకోర్టు


కొనుగోలుదారులపై కేసులు డేంజర్‌!


‘భూమి కొన్న తర్వాత దాని విలువ పెరిగింది’... అంటూ కొనుగోలుదారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం అంటే ప్రమాదకర ధోరణికి తెరలేపినట్లే. తాము అమ్మిన భూమి ధర భారీగా పెరిగితే... కొనుగోలుదారులను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ కేసులో పిటిషనర్లను ఏదో ఒకరకంగా ప్రాసిక్యూట్‌ చేసేందుకు ఒక గుడ్డి ప్రయత్నం జరిగిందని  చెప్పవచ్చు. ఇది ఊహాజనితమైన కారణాలతో ప్రభుత్వం చేపట్టిన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌. నేరం జరిగినట్లు  దర్యాప్తులోనూ  తేలలేదు. హరియాణ ప్రభుత్వం వర్సెస్‌ భజన్‌లాల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ కేసుకూ వర్తిస్తాయి. సుప్రీం తీర్పు ప్రకారం పిటిషనర్లపై కేసు పెట్టడం చెల్లదు. 


- హైకోర్టు


అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పిన ప్రకారమే... 2014 సెప్టెంబరు 1వ తేదీన రాజధాని ప్రాంతంపై మంత్రివర్గం తీర్మానం చేసింది. ఆ మరుసటి రోజునే అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. ఈ వివరాలు మొత్తం మీడియాలో వచ్చాయి. రాజధాని ప్రాంతంలో పిటిషనర్లు మాత్రమే  కాదు... అనేక మంది భూములు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారి అందించిన సమాచారంలోనే స్పష్టంగా ఉంది. 


-హైకోర్టు




అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని  అటకెక్కించేందుకు సర్కారు పెద్దలు తీసుకొచ్చిన ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ వాదన  ఉత్తిదే అని తేలిపోయింది! రాజధాని నిర్ణయంలో రహస్యమేదీ లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎక్కడ రాజధాని వస్తోందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తూనే ఉందని మీడియా కథనాలు ప్రచురితమైన తేదీలతో సహా వెల్లడించింది. ఆస్తులు సమకూర్చుకోవడం పౌరుల హక్కు అని, అది నేరం, మోసం ఎలా అవుతుందని నిలదీసింది. ‘అమ్మిన తర్వాత భూముల ధర పెరిగింది’ అంటూ కొనుగోలుదారులపై కేసులు పెట్టడం ప్రమాదకర ధోరణికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ ద్వారా భూములు కొన్నారంటూ వివిధ సెక్షన్ల కింద ఆరుగురిపై సీఐడీ దాఖలు చేసిన కేసును కొట్టివేస్తూ మంగళవారం జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ సంచలన తీర్పు చెప్పారు.




భూములు కొనుగోలు చేసిన పిటిషనర్లను ప్రాసిక్యూట్‌ చేయడానికి, భూలావాదేవీలకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను వర్తింపచేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నేర న్యాయశాస్త్రానికి (క్రిమినల్‌ జ్యూరి్‌సపుడెన్స్‌)కి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ తెలియని విషయమని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌తో పాటు పోలీసులు జరిపిన దర్యాప్తులో సైతం పిటిషనర్లు నేరానికి పాల్పడినట్లు స్పష్టం కాలేదని తెలిపింది. భజన్‌ లాల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లపై నమోదు చేసిన కేసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.




ఇదీ కేసు...


రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతం గురించి అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకొని, అమరావతి చుట్టుపక్కల కొంతమంది భూములు కొనుగోలు చేశారని వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేశ్‌ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాన్ని ఆధారంగా చేసుకొని నార్త్‌ ఫేస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరె క్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరావు, సీహెచ్‌ తేజస్వీ, లలితా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వెర్టెక్స్‌ హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గాయత్రి రియల్టర్స్‌, గుడ్‌ లైఫ్‌ ఎస్టేట్స్‌, కిలారు రాజేశ్‌, కె.శ్రీహాస తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వారు హైకోర్టులో వేరువేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు, జి.సుబ్బారావు, ప్రణతి వాదనలు వినిపించారు. రాజధాని ఏర్పాటు విషయంలో రహస్యమేదీ లేదంటూ దీనికి సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటనలు, మీడియా కథనాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీనిపై 87 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది.




ఏ సెక్షన్‌ ఎందుకు చెల్లదు!


భూములు కొన్నారంటూ సీఐడీ నమోదు చేసిన ఒక్కో సెక్షన్‌ ఎందుకు చెల్లదో కోర్టు వివరంగా చెప్పింది. అందులోని ముఖ్యాంశాలు...




మోసం కాదు..


భూమిని ఎందుకు కొంటున్నాం, కొన్న తర్వాత ఏం చేస్తాం అనేది విక్రయదారుడికి చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ నేపథ్యంలో పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు దాచారని భావించలేం. ఆ లావాదేవీల వల్ల విక్రయదారుడికి జరిగిన నష్టం ఏమీ లేదు. అందువల్ల... దీనిని ఐపీసీ 420 కింద మోసంగా పరిగణించలేం.




దుర్వినియోగం లేదు..


పిటిషనర్లకు ఎవరూ భూములు అప్పగించలేదు. వాటి దుర్వినియోగం కూడా జరగలేదు. అందువల్ల సెక్షన్‌ 415 ఐపీసీ వర్తించదు.




కుట్ర లేదు..


ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన చట్టబద్ధమైన ఒప్పందంలో నేరపూరిత కుట్ర ఏముంది? 120-బి ఐపీసీ (నేరపూరిత కుట్ర) వర్తించదు.




విశ్వాస  ఘాతుకమూ లేదు..


ఈ కేసులో ‘బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ (విశ్వాస ఘాతుకం) వర్తించదు. 406 ఐపీసీ కింద నేరం జరగలేదు.




ఏజెంట్లు, మర్చెంట్లూ కాదు...


బ్యాంకర్‌, మర్చంట్‌, పబ్లిక్‌ సర్వెంట్‌ లేదా ఏజెంట్‌లు తమకు అప్పగించిన ఆస్తిని దుర్వినియోగం చేస్తే ఐపీసీ 409 సెక్షన్‌ వర్తిస్తుంది. ఇక్కడ భూములు కొన్న వారు వీరెవరూ కాదు.




మూడో  వ్యక్తికేం సంబంధం?


భూములు అమ్మి మేం నష్టపోయామని వాటి యజమానులెవరూ ఇన్ని రోజుల్లో చెప్పలేదు. ‘ఇక్కడ రాజధాని వస్తుంది’ అనే సమాచారం దాచిపెట్టి భూములు కొన్నారని ఫిర్యాదు చేయలేదు. అమ్మిన వాళ్లూ, కొన్నవాళ్లూ ఒక చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. పిటిషనర్లు తమ కుటుంబ, వ్యాపార అవసరాల కోసం భూములు కొన్నారు. నిజంగా తమకు నష్టం జరిగిందని భావిస్తే... ఆరేళ్ల క్రితమే తాము మోసపోయామని కేసులు పెట్టేవారు. ఇప్పుడు... ఇన్నేళ్ల తర్వాత ప్రాసిక్యూషన్‌ వారు చూపిస్తున్న  విక్రేతల వాంగ్మూలాలను వాస్తవాలకు దూరంగా ఉన్నాయని చెప్పవచ్చు. సేల్‌డీడ్‌ను పరిశీలిస్తే... ‘మా భూములు అమ్ముతాం’ అని విక్రేతలే స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.  ఈ లావాదేవీలతో ఏమాత్రం సంబంధంలేని, మూడో వ్యక్తి ఎవరో దీనిపై ఫిర్యాదు చేశారు.  




ఎప్పటికప్పుడు ఇలా...


‘‘కృష్ణా-గుంటూరు జిల్లాల పరిధిలో... కృష్ణా నదీ తీరం వెంబడి రాజధాని వస్తుందనే విషయాన్ని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుసుకున్నారు. 2014 జూన్‌ - డిసెంబరు మధ్య భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని రాజధాని ప్రాంతంలో, మరికొన్ని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అవతల ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాజధాని వస్తోందనే విషయాన్ని రైతుల వద్ద దాచిపెట్టి మోసం చేశారు’’ అని పిటిషనర్లపై కేసు పెట్టారు. కానీ... రాజధాని విషయంలో రహస్యమే లేదని హైకోర్టు స్పష్టం చేసింది.  ఎప్పటికప్పుడు ప్రజలందరికీ  దీనికి సంబంధించిన సమాచారం తెలుస్తూనే  ఉందంటూ పత్రికా కథనాలను ప్రస్తావించింది.అవేమిటంటే...


2014 జూన్‌ 9: ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే... కృష్ణా-గుంటూరు జిల్లాల్లో, కృష్ణా నదీ తీరం వెంబడి కొత్త రాజధాని ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయం అన్ని ప్రముఖ తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. 


2014 జూన్‌ 10: ‘ఏపీ కేపిటల్‌ నియర్‌ గుంటూరు, నాయుడు సేస్‌ హి వాంట్స్‌ కేపిటల్‌ బిట్వీన్‌ గుంటూరు-విజయవాడ’ (గుంటూరు సమీపంలో ఏపీ రాజధాని.. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉండాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు’ అనే శీర్షికన ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ‘‘ఇది అధికారికమే! ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం ప్రకటించారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వస్తుందని, అది హైదరాబాద్‌ నగరంలాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు’’ అని అందులో తెలిపారు.


2014 జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భౌగోళికంగా నడిమధ్యలో, అందరికీ సమాన  దూరంలో ఉన్నందునే విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.


2014 జూలై 7 (ఈనాడు): కృష్ణా నది తీరం వెంబడి ‘అమరావతి’ కేంద్రంగా కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతాన్ని అనుసంధానిస్తూ కొత్తగా భారీ వంతెనలు నిర్మిస్తారు.


2014 జూలై 2 (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా): నాటి శాతవాహనుల రాజధాని ‘అమరావతి’ చుట్టూ ఆంధ్ర ప్రదేశ్‌ కొత్త రాజధాని ఏర్పాటు కానుంది.


2014 జూలై 23 (సాక్షి): కొత్త రాజధానికి సరైన ప్రాంతం కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యనే అని, అక్కడే రాజధాని వస్తుందని సలహా కమిటీ అధ్యక్షుడు (నాటి మంత్రి) నారాయణ ప్రకటించారు. ఢిల్లీలో శివరామకృష్ణన్‌ కమిటీని కలిసి ఈ విషయం వెల్లడించారు.


2014 సెప్టెంబరు 24 (ఈనాడు): కొత్త రాజధాని చుట్టూ ఒక రింగ్‌ రోడ్డు వస్తుంది.  రాజధానికి 30వేల ఎకరాలు అవసరమవుతాయి. (ఇదే  కథనంలో ‘పుత్రజయ’ నగర చిత్రాన్ని కూడా ప్రచురించారు)


2014 సెప్టెంబరు 5 (ఎకనమిక్‌ టైమ్స్‌): విజయవాడ ప్రాంతంలోనే కొత్త రాజధాని వస్తుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.


2014 అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తుళ్లూరు మండల పరిధిలోనే కొత్త రాజధాని వస్తుంది. భూసమీకరణ విధానంలో రైతుల నుంచి 30వేల ఎకరాలు సమీకరించాలని భావిస్తున్నారు.


2014 అక్టోబరు 30 (ఎకనమిక్‌ టైమ్స్‌): రాజధానిపై కొన్ని నెలలుగా ఉన్న సస్పెన్స్‌కు  తెరపడింది.ఆంధ్రపద్రేశ్‌కు ‘రివర్‌ ఫ్రంట్‌’ రాజధాని రానుంది. కృష్ణా నదికి దక్షిణాన గుంటూరు జిల్లాలోని 17 గ్రామాల పరిధిలో రాజధాని వస్తుంది.  (ఆయా గ్రామాల పేర్లు కూడా ప్రచురించింది.)


2014 అక్టోబరు 31: చంద్రబాబు కలలు కంటున్న ‘రివర్‌ఫ్రంట్‌ రాజధాని’ నిర్మాణంపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమై.. ల్యాండ్‌ పూలింగ్‌ చేయాల్సిన 17 గ్రామాలను గుర్తించింది.

Tuesday 21 April 2015

ప్రత్యేక హోదా ఇవ్వకపోవచ్చు

ప్రత్యేక హోదా ఇవ్వకపోవచ్చు


  •  ఆ స్థాయి ప్యాకేజీ సాధనకు సిద్ధం కావాలి
  •  కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలి
  •  ఒకటికి రెండుసార్లు అడగాలి
  •  చైనా స్థాయిలో నవ్యాంధ్రను అభివృద్ధి చేయాలి
  •  పార్టీ ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబు
  •  పుష్కరాలకు ప్రధానిని ఆహ్వానించాలని నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కనిపించట్లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ప్రత్యేక హోదా స్థాయి ప్యాకేజీని సాధించుకునేందుకు సిద్ధం కావాలని తెలుగుదేశం ఎంపీలకు ఆయన సూచించారు. ఏపీ భవన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్‌ గజపతిరాజు సహా పార్టీ ఎంపీలంతా ఈ భేటీకి హాజరయ్యారు. బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఇందులో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒకపక్క ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇవ్వకపోవచ్చుననే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు గ్రాంటుల రూపంలో వస్తాయని, ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా అదే స్థాయిలో.. లేదంటే 70 శాతానికి తగ్గకుండా నిధులు సాధించేందుకు సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు, పనులకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ఆయా శాఖల కేంద్ర మంత్రుల్ని కలవాలని తెలిపారు. ఒకటికి రెండుసార్లు కేంద్ర మంత్రుల్ని కలవటంలో తప్పు లేదని, వాస్తవానికి అలా కలిసి వివరించబట్టే గత నెలలో రాషా్ట్రనికి రావాల్సిన నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. ఆర్థిక సంవత్సరం చివర్లో రాషా్ట్రనికి రావాల్సిన నిధుల్ని విడుదల చేయించుకోవటంలో ఎంపీల చొరవను ప్రశంసించారు. విభజన సందర్భంగా ఇచ్చిన పలు హామీలను ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సి ఉందని.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బూర్గంపాడు గ్రామ అంశాన్ని పరిష్కరించుకోవాలని తెలిపారు. రాజధానికి నిధులు రాబట్టుకోవాలని, 13వ ఆర్థిక సంఘం బకాయిలు రూ.690 కోట్లు విడుదల కావాల్సి ఉందని గుర్తు చేశారు.
కేంద్రానికి మద్దతివ్వాల్సిందే!
పార్లమెంటులోనూ బయటా ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలబడాలని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. భూసేకరణ బిల్లు విషయంలో కూడా అన్ని విధాలా సహకరించాలని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, జరపాల్సిన చర్చలు మొదలైన అంశాలపైనా పలు సూచనలు చేశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం ఎన్‌కౌంటర్‌ గురించి తమిళనాడు ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తే తక్షణం స్పందించి వాస్తవాలను తెలియజేయాలన్నారు.
నీళ్లు వాడుకోనిస్తే కరెంటిద్దాం
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆ నీటిని రాయలసీమ అవసరాలకు వాడుకునేందుకు తెలంగాణ అంగీకరిస్తే ఆ రాషా్ట్రనికి అవసరమైన విద్యుత్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. తన చైనా పర్యటన విశేషాలను కూడా చంద్రబాబు ఎంపీలకు తెలిపారు. చైనాలో జరిగిన అభివృద్ధి చాలా బాగుందని కొనియాడారు. అదే స్థాయిలో నవ్యాంధ్రని అభివృద్ధి చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఎంపీలంతా తమతమ నియోజకవర్గాలు, జిల్లాలను అభివృద్ధి చేసుకునేందుకు విభిన్నమైన ప్రణాళికలు రచించాలని చంద్రబాబు సూచించారు. ఎంపీ ల్యాడ్స్‌ నుంచి కొంతమేర నిధులు ఇస్తే వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని నిధుల్ని మ్యాచింగ్‌ గ్రాంటుగా జతచేసి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చునని తెలిపారు. టాటా ఫౌండేషన్‌ సహకారంతో దాదాపు 400 గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌ కింద మౌలిక సదుపాయాల కల్పనకు విజయవాడ ఎంపీ కేశినేని నాని చూపిన చొరవను ప్రశంసిస్తూ.. మిగతా ఎంపీలు కూడా ఇదే రీతిలో విభిన్నంగా ఆలోచించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు.
ఢిల్లీ, ఏప్రిల్ 22:  ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకూ తామేమీ మాట్లాడబోమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. టీడీపీపీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ డిమాండ్‌ మాత్రం ప్రత్యేక హోదాయేనని, దాని కోసమే తాము ఇప్పటికీ కేంద్రాన్ని కోరుతున్నామని స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదాను వదిలేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనిది మాత్రం భిన్నమైన పరిస్థితి అని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్య అనంతపురం పర్యటనకు వచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో మరొకమారు ఈ అంశంపై మాట్లాడామని చెప్పారు.

మరో సింగపూర్‌ సాధ్యమా?

మరో సింగపూర్‌ సాధ్యమా?
  •  కష్టపడితే సాధ్యమేనంటున్న సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలు
  •  ఏపీకి భూమి, వనరుల లభ్యత అనుకూలమని వెల్లడి
(సింగపూర్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘సీమాంధ్రను మరో సింగపూర్‌ చేస్తాం’.. ఎన్నికల ముందు, ఎన్నికల ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతోసహా టీడీపీ నేతలు తరచూ చెబుతున్న మాట ఇది. అభివృద్ధిపరంగా, పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించడంలో అనేక వందల రెట్లు ముందున్న సింగపూర్‌ను అందుకోవడం ఏపీకి సాధ్యమేనా? చిత్తశుద్ధితో శ్రమిస్తే సాధ్యమేనంటున్నారు అక్కడి ప్రభుత్వ పెద్దలు.. అధికారులు. సింగపూర్‌ కన్నా వనరుల పరంగా ఏపీ ఎంతో ముందు ఉందని, వ్యవసాయం.. ఉత్పత్తి పరిశ్రమలు.. భూమి.. మానవవనరులు.. ఇవన్నీ ఏపీని సింగపూర్‌ కన్నా మెరుగైనస్థానంలో ఉంచేందుకు దోహదపడే అంశాలని వారు విశ్లేషిస్తున్నారు.
 
పర్యాటకమే ప్రధానం
పర్యాటకంపైసింగపూర్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉన్న నదిని వీలైనంత శుభ్రం చేసి దానికి ఇరు పక్కలా పర్యాటక ఆకర్షణ కేంద్రాలను నిర్మించారు. అమెరికాకు చెందిన ఒక కంపెనీ రూ.40 వేల కోట్ల వ్యయంతో 88 అంతస్థులతో ఓ భవనాన్ని నిర్మించి అందులో కాసినోను ఏర్పాటు చేసింది. పర్యాటకుల కోసం ఒక ఈత కొలను, హోటళ్లు పెట్టింది. ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడులు మూడేళ్లలో తిరిగి వచ్చేశాయని మీడియా బృందానికి సహాయకుడిగా వచ్చిన సింగపూర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. సింగపూర్‌లో హోటళ్లు నిత్యం కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇక్కడ హోటళ్లకున్న డిమాండ్‌ను పట్టి సింగపూర్‌లో మూడో హోటల్‌ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. అభివృద్ధికి తలమానికంగా ఉన్న సింగపూర్‌కు భూ లభ్యతే పెద్ద సమస్యగా మారింది. చుట్టూ నీరు ఉన్న ద్వీపం కావడంతో వేరే దారి లేక సముద్రాన్ని పూడ్చి వాడకానికి అనువుగా మార్చుకొంటున్నారు. భూ లభ్యత సమస్య నివారణకు బహుళ అంతస్థుల నిర్మాణాలను విరివిగా చేపట్టారు.
 
ఆంధ్రప్రదేశ్‌ కూడా అందుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా సింగపూర్‌ మాదిరిగా అభివృద్ధిని అందుకోవచ్చునని, కావాల్సిందల్లా సరైన ప్రణాళిక మాత్రమేనని ఆ దేశ వాణిజ్య పరిశ్రమల మంత్రి షణ్ముగం అభిప్రాయపడ్డారు. ఏపీలో వనరుల లభ్యత అధికంగా ఉందన్నారు. ‘‘మాతో పోలిస్తే మీకు భూ లభ్యత చాలా ఎక్కువ. మేధో సంపత్తి కలిగిన మానవ వనరులూ ఉన్నాయి. ఐటీ పరిశ్రమ మీ వద్ద బాగా అభివృద్ధి చెంది ఉంది. పెద్ద పరిశ్రమలు రావడానికి...పెట్టడానికి మీకు వసతులు ఉన్నాయి. ఇన్ని వనరులుంటే అద్భుతాలు చేయవచ్చు. అంతేకాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారాలను...వ్యాపార సంస్ధలను ఆకర్షించగలగాలి. వారిలో విశ్వాసం కలిగించాలి. ఆ పని చేస్తే సింగపూర్‌కు కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్‌ నిలబడగలుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌కు లభించిన మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంఽధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ఇస్తున్న అధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘తూర్పు ఆసియా దేశాల సముద్ర వాణిజ్యానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ ద్వారంగా మారడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏ దారిలో వెళ్తే ఇతర దేశాలను ఆకర్షించగలమో అదే పనిని బాగా చేస్తోంది. దీనివల్ల అందరి దృష్టి ప్రస్తుతం అటువైపు పడుతోంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తాము మొత్తం పదహారు విడివిడి ప్రణాళికలు తయారు చేస్తున్నామని మరో అధికారి తెలిపారు. కాని ఈ ప్రణాళికల అమలుకు నిధుల సమీకరణే పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది. దీనికి విదేశాల్లోని సంస్థల నుంచి నిధుల సమీకరణే మార్గమని సింగపూర్‌లోని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు విదేశాల్లో మంచి ట్రాక్‌ రికార్డు ఉందని, అందువల్ల ఫలితం ఉండవచ్చని అనుకొంటున్నామని ఒక అధికారి వ్యాఖ్యానించారు. 
 
ఇలా ఎదిగారు..
ఒకప్పుడు సింగపూర్‌ ఎంతో అధ్వానంగా ఉండేది. అక్కడి పాలకుల చిత్తశుద్ధితో క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతూ వచ్చాయి. వనరులపరంగా ఇప్పటికీ సింగపూర్‌ బాగా వెనకబడి ఉంది. ఆ దేశంలో వ్యవసాయం లేదు. ఉత్పత్తి పరిశ్రమలు లేవు. భూమి లేదు. మానవ వనరులూ అంతంతే. ఒకానొక సమయంలో మంచినీటిని కూడా పొరుగున ఉన్న మలేషియా నుంచి దిగుమతి చేసుకొనేవారు. కానీ ఇవేవీ సింగపూర్‌ అభివృద్ధికి అవరోధాలుగా నిలవలేదు. వారు ప్రతి వాన చుక్కను ఒడిసి పట్టుకోవడం నేర్చుకున్నారు. వాడిన నీటిని తిరిగి వాడుకోవడానికి అవసరమైన సాంకేతికతను సంపాదించారు. ‘న్యూ వాటర్‌’ పేరుతో పునర్వియోగ నీటిని తాగు నీటిగా మార్చి వాడుతున్నారు. అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించడంలోనూ సింగపూర్‌ కొత్త పుంతలు తొక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలను సింగపూర్‌కు ఆకర్షించడం ద్వారా నిధుల కొరతను ఆ దేశం అధిగమించగలిగింది. ‘పచ్చదనం, పరిశుభ్రత ఉన్న ప్రపంచస్థాయి నగరంగా సింగపూర్‌ను తీర్చిదిద్దడం ఒక్క రోజులో సాధ్యం కాలేదు. మురికివాడలు లేకుండా చేయడానికి ప్రభుత్వపరంగా గృహ నిర్మాణం చేపట్టి పౌరులకు నివాస వసతి కల్పించాం. నిరుద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి ఉపాధికల్పనకు బాటలు వేశాం. భవిష్యత్తులో ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నిర్ణయించుకొని ఒక మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసుకొన్నాం. కళ్ల ముందు అభివృద్ధి కనిపిస్తుండంతో పౌరులు సహకరించడం మొదలు పెట్టారు’ అని నగర ప్రణాళికా విభాగం అధికారి వివరించారు. 

నవ్యాంధ్ర హుస్సేన్‌ సాగర్‌ !

నవ్యాంధ్ర హుస్సేన్‌ సాగర్‌ !

తాడికొండ, ఏప్రిల్‌ 22 : నవ్యాంధ్ర రాజధాని నగరం తుళ్లూరులోని యరమాసు, గంటలమ్మ చెరువులుగా పిలిచే జంట చెరువుల రూపురేఖలు మారనున్నాయి. సుమారు 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన రెండు చెరువులను హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ తరహాలో తీర్చిదిద్ధాలని యోచిస్తున్నారు. చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాలని భావిస్తున్నారు. చెరువు పూడిక, అభివృద్ధి పనులను త్వరలో చేపట్టనున్నట్లు సర్పంచ్‌ నరసింహారావు తెలిపారు.

Friday 27 March 2015

‘రాజధాని’లో బస ఇక్కట్లు

‘రాజధాని’లో బస ఇక్కట్లు

మంగళగిరి (మార్చి 27): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలు మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. ఇదే సమయంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోవడంతో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల నుంచి రియల్టర్లు వచ్చి అమ్మకాలు, కొనుగోళ్లు చేయడంతో రద్దీ బాగా పెరిగింది. లక్షలాది, కోట్లాది రూపాయలు చేతులు మారు తున్నప్పటికీ ఎవరైనా వచ్చి ఒక్క రాత్రి ఇక్కడ ఉండడానికి సరైన వసతులు లేకపోవడంతో అనేక మంది ఎంత రాత్రయినా విజయవాడ, గుంటూరు నగరాలలో వసతి కోసం లాడ్జిలు, త్రీస్టార్‌ హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. మంగళగిరిలో ఇప్పటివరకు కేవలం ఐదు చిన్న లాడ్జీలు, కేవలం పది మందికి మాత్రమే వసతి కల్పించే హోటళ్లు ఉన్నాయి. ఆరు నెలల నుంచి తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాలలో రియల్టర్లే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యాత్రీకులు, సందర్శకులు, పలువురు తమ ఆస్తులను పరిరక్షించుకోవడానికి వస్తున్నా రు. ఇక్కడ రెండు రోజులు గడపడానికి హోటళ్లు లేకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. విజయవాడలో సకల వసతులతో హోటళ్లు అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది రాత్రి సమయాల్లో అక్కడ ఉండి ఉదయం మంగళగిరి పరిసర ప్రాంతాలకు వచ్చి తమ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు మంగళగిరి మీద దృష్టి పెట్టని కొంతమంది త్రీస్టార్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ యజమానులు ఇక్కడ భారీ నిర్మాణాలతో హోటళ్లు కట్టడానికి ముం దుకొస్తున్నారు. తాజాగా మంగళగిరి బైపాస్‌ రోడ్డు సమీపంలో భారీగా ఫైవ్‌స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన ఒక బడా కాంట్రాక్టరు ముందుకొచ్చారు. ఇదే సమయంలో గుంటూరు- విజయ వాడ మధ్య ఒకటి, రెండు హోట ళ్లు, రిసార్ట్స్‌ ఉన్నప్పటికీ ఇప్ప టివరకు ఆశించిన స్థాయిలో కస్టమర్లు బస చేయ కపోవడంతో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
రాజధాని ప్రకటనతో ఊపు..
రాజధాని పేరు వెలుగులోకి వచ్చిన తరువాత వారిలో తిరిగి ఉత్సాహం పెరిగి రాయలసీమ, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొంత మంది కాంట్రాక్టర్లు వాటిని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో రానున్న కాలంలో మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాలలో వసతి సౌకర్యం మెరుగు పడుతుందని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎయిమ్స్‌, రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్న అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక రాజధానిపై కూడా కనీసం ఐదు వేల మందికి వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అవసరమైన వసతి ఏర్పాటు చే యాల్సిన అవసరం ఉంది. మంగళగిరి ప్రాం తంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో, పీపీపీ విధా నంలో కాటేజీల నిర్మిస్తే కొంతవరకైనా వస తు లు కల్పించవచ్చని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.
 
అభివృద్ధి పనులపైనే హోటల్స్‌ భవిష్యత్‌...
గుంటూరు-విజయవాడ మధ్య ఇప్పటివరకు ఉన్న హోటళ్లు, రిసార్ట్స్‌ ఆక్యుపెన్సీ రేటు చాలా తక్కువగా ఉందని హ్యాపీ క్లబ్‌ రిసార్ట్స్‌ అధినేత అంబటి మధు మోహనకృష్ణ తెలిపారు. రాజధాని ప్రకటన తరువాత గుంటూరు కంటే విజయవాడ హోటళ్ల బస చేసే రేటు బాగా పెరిగిందని తెలిపారు. మంగళగిరి, పరిసర ప్రాంతాలలో ప్రభుత్వం ప్రకటించిన రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో టూరిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ భవిష్యత్తు బాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు ఫైవ్‌స్టార్‌, త్రీస్టార్‌ హోటల్‌ నిర్మాణానికి విజయవాడ, ఎయిర్‌పోర్టు దగ్గర్లో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు వేగవంతం చేసినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఇక్కడ వసతి కల్పించడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నర్తకి మల్లిక పేరిట ఏర్పడిన మల్కాపురం

రాజధాని గ్రామాలు: నర్తకి మల్లిక పేరిట ఏర్పడిన మల్కాపురం

- గణపతిదేవుడు, రుద్రమదేవి పాలించిన నేల
- శివాలయం సమీపంలో శిలాశాసనం 
- రాయల ఆస్థాన నర్తకి మల్లిక పేరు మీదుగా..
- ఘన చారిత్రక నేపథ్యం మల్కాపురం సొంతం
 
తుళ్లూరు: వ్యవసాయ పనులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలోనే గడిపే మల్కాపురం వాసులకు గొప్ప చరిత్ర ఉంది. మల్కాపురం చిన్నపాటి ఊరే అయినా చారిత్రాత్మక ప్రదేశం అని కొంతమందికే తెలుసు. క్రీస్తు శకం 1000 నుంచి 1323 మధ్య కాలంలో కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించే వారు. వారిలో ముఖ్యుడైన గణపతిదేవుడు క్రీస్తు శకం 1199 నుంచి 1262 కాలంలో, 1262 నుంచి 1289 మధ్యకాలంలో ఆయన కుమార్తె రుద్రమదేవి పరిపాలించారు. రుద్రమదేవి తొలి మహిళా రాజ్యాధినేతగా ఖ్యాతికెక్కారు. కాకతీయుల కాలంలో చెక్కిన శిలాశాసనం మల్కాపురంలో ఉంది.
 
అమరావతి శివలింగం ఇక్కడిదే..
మల్కాపురంలోని శాసనానికి 150 అడుగుల దూరంలో శిథిలావస్థలో ఉన్న గుడి ఉంది. అమరావతి శివలింగం ఈ గుడిలో ఉండేదని దొంగలు చోరీ చేసి పారిపోతుండగా కృష్ణా తీరం వెంట నందులు వారిని వెంబడించగా అమరావతి వద్ద వదలి పారిపోయారని చరిత్ర చెబుతోంది. ఆ శివలింగానికి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఆలయం కట్టించారని ప్రతీతి. అందుకే మల్కాపురం శిలాశాసనంపై ఉన్న నంది అమరావతి వైపు ఉన్న శివుడిని చూస్తున్నట్లు ఉంటుంది. కృష్ణా తీరం వద్ద నేటికీ నందులు దర్శనమిస్తూంటాయి.
 
చరిత్రకు సాక్ష్యం..
మల్కాపురం శిలాశాసనానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈ శాసనంలో కాకతీయుల రాజవంశవర్ణం , గోళకీమఠ సాంప్రదాయం మొదలైన విషయాల ప్రస్తావన ఉంది. శాసనం తొలి నాలుగు శ్లోకాల్లో ఇష్టదేవత ప్రార్థన, ఐదో శ్లోకం నుండి 21 శ్లోకం వరకు కాకతీయ రాజవంశం ప్రస్తావన, 38 శ్లోకం దాన శాసన కాలాన్ని, 39, 40 శ్లోకాలు దాన స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. శాసనం రెండు వైపులా సంస్కృత భాషలో చెక్కిన రెండు వందల పంక్తులు ఉన్నాయి. ఒక వైపు పరిశీలించగా కాకతీయుల రాజుల పరిపాలన గురించి, రెండో వైపు గణపతిదేవుడి గురువు విశ్వేశ్వరశంభునకు మందడం, వెలగపూడి, మల్కాపురం దానం చేశారని ఉంది.
 
నర్తకి మల్లిక పేరు మీదుగా..
శ్రీకృష్ణదేవరాయుల కొలువలో నర్తకి మల్లికకు రెండు గ్రామాలు కలిపి కొంత భూమిని దానమిచ్చినందున మల్కాపురంగా మారిందని ఒక ప్రచారం ఉంది. ఇది కొంత కాలం అగ్రహార గ్రామంగా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంది. మం దడం, వెలగపూడి గ్రామాలు కాలాంతరంలో మందడం, మల్కాపురం, వెలగపూడిగా మారాయి. మల్కాపురం జనాభా దాదాపు 1400. ఓటర్ల సంఖ్య 1015 . వ్యవసాయమే గ్రామస్తుల జీవనోపాధి. రాజధాని ప్రకటించటంతో గ్రామ రూపు రేఖలు మారనున్నాయి.

Thursday 26 March 2015

అమరావతి స్తూపం

అమరావతి స్తూపం

వికీపీడియా నుండి
గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడాన్ని స్తూపము అంటారు. ఆంధ్రదేశమందు, ముఖ్యముగా కృష్ణానదీ లోయలో, బౌద్ధమతము మౌర్యకాలము నుండి పరిఢవిల్లింది. అమరావతి(ధరణికోట), భట్టిప్రోలు, జగ్గయ్యపేట (బేతవోలు), ఘంటసాలశాలిహుండం మొదలైన చోట్ల స్తూప నిర్మాణము జరిగింది. వీటిలో అమరావతి స్తూపము ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. కార్బన్ డేటింగ్ ద్వారా అమరావతి (ధాన్యకటకము) పట్టణం క్రీ.పూ. 5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది[ఆధారం కోరబడినది]. స్తూపము క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది[1].
అమరావతి స్తూపం నమూనా (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మ్యూజియంలో ఉన్న చిత్రం

అమరావతి[మార్చు]

అమరావతి స్తూపం అవశేషాలు
Main article: అమరావతి
అమరావతిఆంధ్ర ప్రదేశ్‌ గుంటూరు జిల్లాలో ఒక పట్టణము, ఇదేపేరుతో ఉన్న రెవిన్యూ మండలానికి కేంద్రము. ఇది గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్నది. అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకంశాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.

స్తూపము, చైత్యము[మార్చు]

"స్తూపం" అనే పదం సంప్రదాయాన్నిబట్టి బౌద్ధ నిర్మాణాలకే వర్తిస్తుంది. దీని ప్రాకృత రూపం "థూపము". అయితే ప్రాచీన (బౌద్ధ) కాలంలో "స్తూపము" అనే పదం వాడుకలో ఉన్నట్లు కనిపించదు. అందుకు బదులు "చైత్యము" అనే పదమే వ్యవహారంలో ఉండేది. ఒకే చైత్యము ఉంటే దానిని చైత్యమనీ, చాలా చైత్యాలున్నచోట ప్రధాన కట్టడాన్ని మహాచైత్యమనీ అనేవారు కావచ్చును. "చైత్యము" అన్నపదం "చితా" శబ్దమునుండి పుట్టింది. ప్రాచీన బౌద్ధంలో బుద్ధుని, లేదా ఇతర "అర్హతుల" ధాతు విశేషాలను గౌరవ ప్రదంగా లేదా స్మృతి చిహ్నంగా లేదా పూజా సంకల్పంతో భద్రపరచే ఆచారం అప్పుడు ఉండేది. అలా చేయవచ్చునని బుద్ధుడు తన శిష్యుడు ఆనందునితో అన్నట్లు మహాపరినిర్వాణ సూత్రంలో ఉంది. బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి అశోకుడు అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. ఈ ప్రతీతిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు.[2] కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్తూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి. [3]
అమరావతి స్తూపం కట్టడం రేఖాచిత్రం - ఇందులో స్తూప నిర్మాణంలోని వివిధ భాగాలను చూడవచ్చును

బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివశిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్తూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్తూపాలలో మూడు రకాలున్నాయి[4]
  • ధాతుగర్భ స్తూపాలు: బుద్ధునివి గాని, ప్రముఖ ఆచార్యులని గాని అయిన అవశేషాలపై నిర్మించినవి.
  • పారిభోజిక స్తూపాలు: భిక్షాపాత్ర వంటి వస్తువులపై నిర్మించినవి.
  • ఉద్దేశిక స్తూపాలు: ధాతువులు లేకుండా స్మారకచిహ్నంగా నిర్మించినవి.

ఈ చైత్యాలు లేదా స్తూపాలు ఈ గుండ్రని ఆకృతికి కారణాలు గురించి ఊహాగానాలున్నాయి - అది ఉదయించే సూర్యుని చిహ్నం కావచ్చును. లేదా జీవితం బుడగ వంటిదని సూచన కావచ్చును. పైన ఒకటి నుండి మూడు వరకు ఛత్రములుండేవి . అవి త్రిరత్నాల సంకేతం అంటారు. స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు[3].
  1. ఒక వేదిక (Drum)
  2. దానిపైన అర్ధ గోళాకృతి అండము (Semi sperical dome)
  3. అండముపై ఒక హర్మిక (Pavilion)
  4. దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము (Umbrella)
  5. అండము, హర్మికల మధ్య గళము (neck)
  6. చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు (Railings)

పురాతన స్తూపం వెలుగు చూసిన విధం[మార్చు]

క్రీ.శ. 14వ శతాబ్దం తర్వాత మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్తూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కోలిన్ మెకంజీ 1797లో ఈ మహోన్నత సంపదను వెలికితీసి రక్షణకు నాంది పలికాడు. అటు తర్వాత సర్ వాల్టర్ స్మిత్ (1845), రాబర్ట్ సెవెల్ (1877), జేమ్స్ బర్జెస్ (1881), అలెగ్జాండర్ రె (1888-1909), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1958-59), యం. వెంకటరామయ్య (1962-65), ఐ. కార్తికేయ శర్మ (1973-74) మున్నగు పురాతత్వవేత్తలు సాగించిన త్రవ్వకాలలో శిధిలమై విఛ్ఛినమైన మహా చైత్యము బయల్పడింది[5].

చైనా యాత్రీకుడు హ్యూయెన్ త్సాంగ్ ఆరవ శతాబ్దములో అమరావతి స్తూపము సందర్శించునాటికి క్షీణదశ ప్రారంభమైనది. ఐతే క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. హిందూమత ప్రాభవమువల్ల క్రీ.శ. 1700 నాటికి స్తూపము శిధిలావస్థకు చేరుకొంది. పెర్సీ బ్రౌను మహాచైత్యం ఉచ్చస్థితిలో ఎలా ఉండేదో ప్రణాళికను చేశారు.

చరిత్ర[మార్చు]

అమరావతి / ధరణికోట పరిసరములలో మరియు చైత్యపు అట్టడుగు పొరల్లో బృహత్ శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలు లభించాయి. క్రీ. పూ 4-3 శతాబ్దాలనాటి నివాస ప్రదేశాలు, కట్టడాలు, స్థంభాలు వెలుగు చూశాయి. మౌర్యులకు పూర్వమే ఇచట నాగ, యక్ష తెగల జనపదం (గణతంత్ర రాజ్యం) ఉండేదని తెలుస్తోంది. బౌద్ధ భిక్షువు, చరిత్రకారుడు తారనాథుని ప్రకారము గౌతమ బుద్ధుడు ధరణికోటలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించాడు[6][7]. బహుశా ఈ కారణము వల్ల బుద్ధుని మరణానంతరము అమరావతిలో గొప్పస్తూప నిర్మాణము జరిగివుండవచ్చును. మౌర్యులు, సదవంశీయులు, శాతవాహనులుఇక్ష్వాకులుపల్లవులుశాలంకాయనులువిష్ణుకుండినులు,అనంద గోత్రీయులుచాళుక్యులుచోళులు, కోట వంశీయులు, కాకతీయులువిజయనగర రాజులు, కుతుబ్ షాహి నవాబులు వరుసగా అమరావతి/ధరణికోట ను పాలించారు. క్రీ.శ. 4వ శతాబ్ది నుండి 15వ శతాబ్దము వరకు ధరణికోట ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలకస్థానం వహించింది.

మహాచైత్యము నిర్మాణ దశలు[మార్చు]

మహాచైత్యం ధాతుగర్భం. శాతవాహనుల కాలములో ఈ స్తూపము ఉచ్చస్థితి పొందింది. స్తూపనిర్మాణంలో 5 దశలు గుర్తింపబడ్డాయి. అలాగే ధాన్యకటకంలో 5 సాంస్కృతిక దశలు గుర్తించారు.
మొదటి దశ
క్రీ. పూ. 4-3 శతాబ్దాలు. దీనిని మరల రెండు దశలుగా అధ్యయమనం చేశారు. మొదటి దశలో అశోకునికి పూర్వమునుండే (క్రీ. పూ. 3వ శతాబ్ది ఉత్తరార్థం) చైత్య కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో నగిషీ ఉన్న మట్టిపాత్రలు లభించాయి. అశోకుని పూర్వపు బ్రాహ్మీ లిపిలో "ధిసపాత", "మలస" అని వ్రాసి ఉన్న పెంకులు దొరికాయి. అశోకుని శాసనమున్న రాతి ఫలకం దొరికింది. అశోకుని కాలంనాటి రాతి ప్రాకారం, ఆ రాతి స్థంభాలపై శాసనాలు లభించాయి.
రెండవ దశ
ఇది అశోకుని అనంతర దశ. క్రీ. పూ. 2 శతాబ్ది నుండి క్రీ. శ. 1వ శతాబ్ది మధ్యకాలం. ఈ కాలానికి చెందిన మట్టి పాత్రలు, విద్ధాంక నాణేలు, ఇటుకలు లభించాయి. రాతిప్రాకారం సున్నపురాతితో పునర్నిర్మాణం పొందింది. అనేక శాసన, శిల్ప ఫలకాలు చెక్కబడినాయి. వైశాలి, శ్రావస్తి, కుశినగర ప్రదేశాలలోని బుద్ధుని జీవిత సంఘటనలతో కూడిన ఫలకాలున్నాయి.
మూడవ దశ
క్రీ. పూ. 1-2 శతాబ్దాలు. శాతవాహనుల సీసపు, రాగి నాణేలు లభించాయి. చైత్య శిల్పకళ మహోన్నత దశను చేరింది. అచార్య నాగార్జునుడు చైత్యాన్ని పునరుద్ధరించి, అభివృద్ధిచేసి అందమైన శిల్పాలతో తిరిగి నిర్మించాడు. ఈ దశలో మూడు స్పష్టమైన చారిత్రక ఆధారాలు గుర్తించవచ్చు.
  1. పశ్చిమ సింహద్వారము వద్ద లభించిన వాసిష్టీ పుత్ర పులోమావి (క్రీ. శ. 130-159) ధర్మ చక్ర దాన ఫలకం.
  2. ప్రాకారంలోని ఉష్ణీషం పై లభించిన శివశ్రీ శాతకర్ణి (క్రీ. శ. 159-166) శాసనం.
  3. అండం పై భాగం మీద ఉన్న ఫలకం పై లభించిన యజ్ఞశ్రీ శాతకర్ణి (క్రీ. శ. 174-208) శాసనం.
నాలుగవ దశ
క్రీ. శ. 3వ శతాబ్ది నుండి 6వ శతాబ్ది మధ్యకాలం. ఇక్ష్వాకుల నాణేలు విరివిగా లభించాయి. కొన్ని మొక్కుబడి చైత్యాల నిర్మాణం జరిగింది.
ఐదవ దశ
మొదటి పల్లవుల నుండి మధ్య యుగాంతం వరకు (క్రీ.శ. 14వ శతాబ్దం). భూమిస్పర్శ ముద్రలోనున్న బుద్ధుడు, సింహనాద అవలోకితేశ్వర, మంజుఘోష రాతి విగ్రహాలు, మైత్రేయి, మంజుశ్రీ, లోకేశ్వర, వజ్రపాణి మున్నగు రాతి విగ్రహాలు కంచు ప్రతిమలు లభించాయి. మహాయాన బౌద్ధం వజ్రయానంగా మారిన క్రమం స్పష్టంగా గ్రహించవచ్చు.

స్తూపాకృతి, నిర్మాణం[మార్చు]

అమరావతి స్తూపం నమూనా ఫలకం బ్రిటిష్ మ్యూజియం నుండి.
స్తూపం నిర్మాణాన్ని తెలిపే మరొక చిత్రం
లభించిన ఆధారాలకనుగుణంగా చరిత్రకారులు, పురాతత్వవేత్తలు క్రీ. శ. 2వ శతాబ్దిలో చైత్యం ఎలా ఉండేదో అలాంటి నమూనాని నిర్మించారు. పెర్సీ బ్రౌను నిర్మించిన నమూనా చైత్యం చెన్నయి (మద్రాసు)సంగ్రహాలయంలో ఉన్నది. (వ్యాసం ఆరంభంలో ఇచ్చిన బొమ్మ చూడండి.) ప్రాకారం వలయాకారంలో ఉండేది. ప్రాకారంలో నిలువు స్థంభాలు (136), అడ్డకమ్మీలు (348), మదురు (244 మీ) ఉండేవి.
కట్టడం నిర్మాణం ప్రధాన గణాంకాలు
  • ప్రాకార వైశాల్యం: 17,000 చ. అడుగులు, చుట్టు కొలత: 600 అడుగులు
  • ప్రాకారం నిలువు స్థంభాలు ఎత్తు: 2.7 మీ, ప్రాకారం అడ్డకమ్మ వ్యాసం: 85 సెం. మీ.
  • ప్రాకారంతో కూడి స్తూప వ్యాసం: 192 అడుగులు
  • మేధి (Base of Stupa) వ్యాసం: 162 అడుగులు, మేధిగోడల మందం: 1.2 మీ
  • అండం- చుట్టు కొలత: 435 అడుగులు, వ్యాసం: 142 అడుగులు, ఎత్తు: 20 మీ.
  • మేధిపై అండం గోడలు: 4.3 మీ. ఎత్తు
  • స్తూపం ఎత్తు: 100 అడుగులు
  • మేధిపై అండం చుట్టూఉన్న ప్రదక్షిణాపథ వైశాల్యం: 7.1 మీ.
  • నేల నుండి ఉపరితల ప్రదక్షిణాపథం ఎత్తు: 20 అడుగులు
  • ప్రదక్షిణాపథం చుట్టూ రాతి కంచె ఎత్తు: 8 అడుగులు
  • చైత్యం చుట్టూ ఇటుకలు పరచిన ప్రదక్షిణాపథం: 15 అడుగుల వెడల్పు
  • సింహద్వారం వెడల్పు: 7.9 మీ.
ఆయక వేదికలు శిల్పఫలకాలతో కప్పబడిఉండేవి. ప్రాకారంలోని నిలువు స్థంభాలు, అడ్డకమ్మీలు, మదురు సుందరశిల్పాలతో ఉండేవి. మదురు వెలుపలి వైపున పెద్దపూలదండ శిల్పీకరించబడింది. దీనిని స్త్రీలు, పురుషులు మోస్తూ ఉంటారు. పూలదండ వంకీలలో బోధిచెట్టు, ధర్మచక్రం, స్తూపనమూనాలు ఉన్నాయి. పూలదండ మకరం నోటినుండి వెలువడుతున్నట్లు ఉంది. మదురు లోపలివైపున బుద్ధుని జీవిత ఘట్టాలు, జాతక కథలు చెక్కి ఉన్నాయి. నిలువు స్థంభాలపై పద్మాలున్నాయి. వీటిపై భక్తులు బుద్ధచిహ్నాలను ఆరాధిస్తున్న శిల్పాలున్నాయి. జగ్గయ్యపేటలోని చిన్న స్తూపం నమూనాగా తీసికొని ఈ స్తూపాన్ని నిర్మించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.
మేధి లేదా స్తూపాధిష్టానము
మట్టిని పొరలు పొరలుగా పోసి, ఒకో పొరను బాగా దిమ్మిస కొట్టిన తరువాత దానిపై ఇటుకలను పేరిచి అతికి, ఆ పైన రాతిఫలకములను అతికించి స్తూపాన్ని నిర్మించేవారు. శతాబ్దాల తరబడి క్రుంగిపోకుండా స్తూపం ఉన్నదంటే ఇలా మట్టిని ఎంత బాగా కూర్చారో అర్ధం చేసుకోవచ్చును. అలాగే ఒక్క చుక్కయినా నీరు లోపలికి పోకుండా శిలాఫలకాలను అతికించారు.
ధ్యానమగ్నుడైన గౌతమబుద్ధుని దీక్ష భగ్నం చేయడానికి మారుడు దండెత్తడం - సూచనా శిల్పం గ్విమెట్ మ్యూజియం నుండి.
వెలుపలి ప్రాకారము
ప్రాకార వైశాల్యం 17,000 చ. అడుగులు, చుట్టు కొలత 600 అడుగులు. ఈ ప్రాకారం రెండువైపులా ఎంతో అందమయిన శిల్పాలున్నాయి. ఆ శిల్పాల సందాల కారణంగానే ఈ వెలుపలి ప్రాకారానికి దీటు వచ్చేది హిందూదేశంలో మరెక్కడా కానరాదని పరిశోధక పండితుల అభిప్రాయం. ఈ ప్రాకారాన్ని రాతి కట్టడం లాగా కాకుండా చెక్క కట్టడంలాగా నిర్మించారు. ప్రాకారం అంతా నిలువు రాతి స్తంభాలతో ఏర్పడింది. రెండేసి నిలువు స్తంభాలకు మూడేసి అడ్డ రాతి కమ్మలు బిగించారు. స్తంభం పైన "కుసులు" (ముడులు?)గా తీర్చి దిద్దారు. ఈ కుసులను ఆ పై రాతి దూలాలలో తొలిచిన తొలలలో (తొర్రలలో) దూర్చబడ్డాయి. ఇలా పైన ఉండే రాతి దూలాలు ప్రాకారం పైన అంచులాగా ఏర్పడ్డాయి. అది ఉష్ణీషము (తలపాగా) లాగా ఉండడం వలన దానిని ఉష్ణీషము అని వ్యవహరించేవారు. ఉష్ణీషం వెలుపలినైపున పూలదండలను మనుష్యులు మోస్తున్నట్లుగాను, ఆ ఉష్ణీషం వెడల్పు పెరిగిన చోట దాగొబా, బోధివృక్షం, త్రిరత్నాలు, నాగములు, యక్షులు వంటి చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.
ద్వారములు
నాలుగు ప్రక్కలా నాలుగు ద్వారాలున్నాయి. ఒకో ద్వారం వెడల్పు 26 అడుగులు. పొడవు 16 అడుగులు. అరుగు నుండి ద్వారానికి రెండు ప్రక్కలా మూడేసి నిలువురాతి స్తంభాలున్నాయి. ఈ ప్రాకార ద్వార స్తంభాలపై వెనుకటి కాళ్ళమీద కూర్చున్నట్లు సింహాల ప్రతిమలున్నాయి.
వేదిక
అండమునకు దిగువ భాగము వేదిక (ఆరుగు లాంటిది). వేదిక ఎత్తు ఆరడుగులు. ఈ వేదిక ఉపరితలంపై కప్పిన శిలాఫలకాలపై చక్కని అనేక చిత్రాలను చెక్కారు. అలా చెక్కబడినవాటిలో అమరావతి చైత్యం ఆకృతినే వారు చెక్కడం మన అదృష్టం. ఆ శిలా ఫలకాల మూలానే మనకు నేడు అమరావతి చైత్యం ఆకారం తెలియవస్తున్నది.[3] ఇలాంటి ఫలకాలలో ఉత్తమమైనదొకటి మద్రాసు మ్యూజియంలో ఉంది. ఈ వేదిక నాలుగు దిక్కులలో అరుగు ముందరకు వచ్చినట్లు, ఆయా నాలుగు ద్వారాలకు ఎదురుగా, నిర్మింపబడింది. ప్రాకారాలకంటె వేదిక రాయి మెత్తనయినది గనుక వేదిక రాతి ఫలకాలమీద చెక్కిన శిల్పాలు మరింత ప్రశస్తమయినవి. వీటిలో దాగొబాలు (చైత్యం నమూనాలు), నాగములు వంటి శిల్పాలున్నాయి. దాగొబాలు చెక్కిన ఫలకాల కుడియెడమల విడి రాళ్ళమీద చెక్కిన స్తంభాలున్నాయి. వాటిలో బోధివృక్షము, ధర్మచక్ర పరివర్తనము, మార ప్రలోభనము వంటి శిల్పాలున్నాయి.
ఆయక కంభములు
వేదికకు పొడుచుకు వచ్చినట్లున్న నాలుగు అరుగులపైన, అంటే ద్వారాలకు ఎదురుగా, ఐదేసి ఆయక కంబములు (ఆర్యక స్తంభములు - పూజనీయ స్తంభాలు) ఉన్నాయి. అంటే మొత్తం 20 స్తంభాలున్నాయి. ఇలా ఒక్కో దిక్కున అయిదేసి స్తంభాలుండడం ఆంధ్రదేశంలోని స్తూపాలలో కనిపించే విశేష లక్షణం. ఈ ఐదు స్తంభాలు బుద్ధుని జీవితంలో పంచ కళ్యాణములు (బుద్ధావతరణము, మహాభినిష్క్రమణము, మార ప్రధ్వంసము మరియు సంబోధి, ధర్మ చక్ర పరివర్తనము, మహాభినిష్క్రమణము ) అనబడే ఐదు ఘట్టాలకు ప్రతీక. ఈ స్తంభములుమతసంబంధములైన పూజ్యభావములకు చిహ్నములు గనుక సందర్శకులు ముందుగా వాటకి మ్రొక్కి ఆ తరువాత చైత్యమునకు ప్రదక్షిణ చేయువారు - ఇలా వాటిపేరు "ఆయకకంబములు" అయినది.

స్తంభము అడుగు చతురస్రాకారంగాను, మధ్యభాగం అష్టకోణాకారంగాను ఉండగా పై భాగం చూళిక (Capital) అండంరూపంలో ప్రతి దిక్కున తోరణంగా మలచబడింది. దీనికే చైత్యతోరణం అని పేరు. చూళికల పైభాగంలో జెండాలు పెట్టడానికి గుంటలుగా తొలిచారు. ఈ తోరణాల దిగువ భాగం గూళ్ళగా మలచబడి, ఆ గూండ్లలో యక్ష ప్రతిమలు చెక్కారు. ఈ గూండ్లకు చైత్య వాతాయనములని పేరు. అమరావతి చైత్యవాతాయనములలో చెక్కబడిన యక్ష ప్రతిమలు అత్యంత సుందరమైనవని, ఇట్టి కళా కౌశలానికి సరివచ్చేవి మరెక్కడా కానరావని కళావిమర్శకుల అభిప్రాయం.[3]
అండము
అండము వేదిక పైన ఉంటుంది. అండం చుట్టు కొలత 435 అడుగులు, వ్యాసం 142 అడుగులు, ఎత్తు 20 మీ. చైత్యానికి ప్రదక్షిణం చేసేటపుడు కనిపించే బౌద్ధ ధర్మ చిహ్నాలు అండం దిగువ భాగంనుండి ఆరంభమౌతాయి. క్రింది వరుసలో బోధివృక్షం (జ్ఞానదీక్ష చిహ్నంగా) శిల్పాలు, ఆ పై వరుసలో ధర్మ చక్రం చిహ్నాలు (జ్ఞానబోధ చిహ్నంగా) , ఆ పైని వరుసలో స్తూపము (బుద్ధుని నిర్వాణం చిహ్నంగా) చెక్కబడినాయి. దిగువ వరుసలో మధ్య మధ్యలో (పూర్తి ఫలకం పట్టుటకు వీలు లేని చోట) పూర్ణ ఘటకములను చెక్కిన శిలాఫలకములను అతికి "ఆబద్ధము" చేశారు. కనుక వీటికి "ఆబద్ధమాల" (ఆ సమంతాత్ బద్ధ మాలా) అని పేరు. శాసనాలలో ప్రాకృతంగా "అబతమాల" అని పేర్కొన్నారు.
ఈ మూడు వరుసలకు ఎగువగా సింహ ప్రతిమలు చెక్కబడినాయి. వాటికిపైన త్రిరత్నములకు చిహ్నంగా త్రిశూలాలవంటి శిల్పాలు ఉన్నాయి. వాటికిపైన పుష్ప మాలికలు, ఆ పుష్పమాలికల మధ్య చిన్ని చిన్ని వృత్తాలలో బుద్ధ జీవిత గాధలు చెక్కబడ్డాయి. వాటికి పైన "హర్మిక" మొదలవుతుంది.

హర్మిక
హర్మిక, అండానికి పైని, గళము (ఛత్రం నిలిపే కడ్డీ)కు ఆధారంగా ఉంది. ఇది చతురస్రంగా, ఒక పెట్టెవలె, ఉండే నిర్మాణం. ఈ హర్మిక అంతర్భాగంలోనే బుద్ధుని ధాతువులు నిక్షప్తమై ఉండేవని కొందరి అభిప్రాయం. హర్మిక ప్రక్కటంచులలో (సాంచీ స్తూపం వలె) చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.
ఛత్రములు
ఇతర విశేషాలు
ఇలా చైత్యం వివిధ భాగాలలో చెక్కబడిన శిలాఫలకాలే కాకుండా విడివిడిగా ఉన్న విగ్రహాలు, చాలావరకు శిధిలమైపోయినవి, లభించాయి. వీటిలో బుద్ధుని విగ్రహములే కాక ఇతర విగ్రహాలు (యక్షులవి కావచ్చును) కొన్ని ఉన్నాయి. వీటిలో తల లేని విగ్రహమొకటి ఎవరిదోనని పురాతత్వశాస్త్రజ్ఞులలో కొన్ని విభేదాలున్నాయి. ఆ విగ్రహం చేతిలో పద్మములవంటి పుష్పాలున్నాయి. అది గౌతమీపుత్ర శాతకర్ణిదన్న అభిప్రాయం కూడా ఉంది. కాని అది బహుశా బుద్ధుని విగ్రహం కాని, లేదా బుద్ధుని పూజింపడానికి వచ్చిన యక్షుని విగ్రహం కాని కావచ్చును.[3]
విడిగా లభించిన శిల్పాకృతులలో బుద్ధుని పాదాలు విశేషంగా పేర్కొనదగినవి. ఈ శ్రీపాదాలలో స్వస్తిక చిహ్నము, సహస్రార చక్రము, త్రిరత్న చిహ్నమైన త్రిశూలము కనుపిస్తున్నాయి.

పూర్ణిమ, అమావాస్యలలోను, ఇతర ఉత్సవాలలోను ఈ చైత్యం మొత్తాన్ని వేలకొలది దీపాలతో అలంకరించేవారు. రాత్రులలో ఇది దీపాల తిమ్మెలాగా కనిపించేది. ఇందువల్లనే ఈ స్తూపమునకు "దీపాలదిన్నె" అని పేరువచ్చి ఉండవచ్చును.

మంజూషికలు[మార్చు]

అమరావతి చైత్యంలో కనుగొన్న ధాతుకరండాల పేటికల చిత్రాలు
మహాచైత్య గర్భంలోనూ, ఇతర భాగాలలోనూ పవిత్ర ధాతువులున్న పది మంజూషికలు లభించాయి. మహాచైత్య గర్భంలో లభించిన మొదటి మంజూషిక శిలాపేటిక. ఇందులో ఒక స్ఫటికపు మంజూషిక, అందులో ఒక ముత్యం, స్వర్ణపత్రాలు ఉన్నాయి. రెండవ మంజూషిక మహాచైత్య పరిధిలో లభించిన గుండ్రని మట్టిపాత్ర. 3 1/2 అంగుళాల ఎత్తున్న స్వర్ణ అవశేషం, ఛత్రం ఉన్నాయి. ఈ కరండానికి మూత, గిన్నె ఉన్నాయి. గిన్నెలో శల్యశకలం, దంతవస్తువులు, బ్రాహ్మీ లిపిలో ఉన్న ముద్రిక, ఆరు చిన్న స్వర్ణపుష్పాలు ఉన్నాయి.

మూడు నుండి ఏడవ మంజూషిక వరకూ అన్నీ స్ఫటికపు కరండాలు. ఈ ఐదు మంజూషికలు దక్షిణ ఆయకవేదికకు అమర్చిన శిలాఫలకంలోని రంధ్రాలలో లభించాయి. ప్రతి మంజూషికలోనూ ఒక శల్యశకలం, స్వర్ణపుష్పాలు, ముత్యాలు, కోరల్ పూసలున్నాయి. ఎనిమిదవ స్ఫటికపు మంజూషిక పశ్చిమ ఆయకవేదిక పునాదిలో ప్రదక్షిణాపథానికి 35 సెం.మీ లోతున లాభించింది. మంజూషిక ఎర్రటి కుండలో ఉంది. పన్నెండు గుండ్రటి శంఖపు పూసలు, ఒక శిలాస్ఫటికపు గొలుసు, అస్ఠికతో తయారైన గొలుసు, నీలపు బెరిల్ పూసలు ఉన్నాయి. తొమ్మిదవ మంజూషిక స్ఫటికపు కరండం. తూర్పు దిశలోని ఆయక వేదికపైని సున్నపు స్లాబ్ లో 42సెం.మీ గుండ్రటి రంధ్రం లో దొరికింది. ఎనిమిది ముత్యపు పూసలు, ఒక స్ఫటికపు పూస ఉన్నాయి. పదవ మంజూషిక దంతపు పేటిక. లభించినవి పేటిక ముక్కలు మాత్రమే.

విహారములు-విశ్వవిద్యాలయము[మార్చు]

ధాన్యకటకములోనిది మహావిహారం. అనగా ఒకే ప్రాకారంలో అనేక విహారాలున్నాయి. హుయాన్ త్సాంగ్ వ్రాతలలో 'పూర్వశైల సంఘారామం' అనబడింది. ఒక శాసనం ప్రకారం పాటలీపుత్ర బౌద్ధ భిక్షువుల కోసం ఒక ప్రత్యేక విహారముంది. మహాచైత్యానికి నైరుతీ దిశలో ఉన్న నేటి బచ్చలమ్మ గుడి ముందున్న కుంటను మంజుశ్రీ విహారంగా గుర్తించారు. విహారంలో దేశ విదేశాలనుండి వచ్చిన శ్రమణులు, పండితులు, యాత్రికులు, భిక్షువులు వివిధ అంగాలను అభ్యసించేవారు. ధమ్మమేకాక లౌకిక విషయాలపై కూడా బోధన, పరిశోధన జరిగేవి. ఖగోళ శాస్త్రముజ్యోతిష్యమున్యాయమువ్యాకరణముతర్కము మున్నగు శాఖలలో బోధన జరిగేది.

విశ్వవిద్యాలయములో 8000 మంది ఉన్నతవిద్య నభ్యసించడానికి అవకాశాలుండేవి. నలందా విహారము తర్వాత పెద్ద విహారమిదే. ధాన్యకటకవిద్యాపీఠం నమూనాగా టిబెట్ రాజధాని లాసాలో డాపంగ్ విశ్వవిద్యాలయమునిర్మించబడిందని లామా తారానాథుడు పేర్కొన్నాడు.[2] అశోకుడు పంపిన మహాదేవభిక్షు ధాన్యకటక చైత్యశాలలో నివసించి ధర్మప్రచారం చేశాడు. బోధిసత్వమంజుశ్రీ ఇచటినుండే పరిసరారణ్యములోని నాగజాతి ప్రజలకు బౌద్ధం బోధించినట్లు, 'బోధిచర్యావతారం' అనే గ్రంథానికి జన్మభూమి అయినట్లు 'గండవ్యూహ' అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది.

ఆచార్య నాగార్జునుడు ఇచటి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో హుయాన్ త్సాంగ్ 'అభిధమ్మ పిటకం' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిధిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇరవై విహారాలలో మాత్రం బౌద్ధ సాంఘికులు నివశిస్తున్నట్లు వ్రాశాడు. [2] అనగా అప్పటికే వైదికమతము పుంజుకున్నట్లు తెలుస్తున్నది. క్రీ. శ. 1344నాటి గదలదేనియ (కాండీ, శ్రీలంక) శాసనం ప్రకారం బౌద్ధ థెర ధర్మకీర్తి రెండంతస్తుల విహారానికి జీర్ణోద్ధరణ చేశాడు.

ధాన్యకటకంలో నాగార్జునుని కాలంనుండి మహాయానమే ముఖ్యసంప్రదాయమైనా గాని, ఇతర సంప్రదాయాలు కూడా ఆదరణ పొందాయి. వజ్రయానం విస్తరించినపుడు కూడా తాంత్రిక పద్ధతులకు ధాన్యకటకం ప్రధాన కేంద్రంగా ఉండి ఉండవచ్చును. ఎందుకంటే ఇది దక్షిణాపథంలో తంత్రప్రతిష్ఠాపనములకు చాలా ప్రసిద్ధికెక్కిందని టిబెట్ దేశపు బౌద్ధ గ్రంధాలు తెలుపుతున్నాయి. "దశవలుడు" అనే బౌద్ధ సాధువు శ్రీధాన్యకటకం చైత్యం వద్ద తంత్రములన్నీ నేర్చుకొన్నాడట.[2] "మాతృ తంత్ర కాలచక్రము" ఈ ధాన్యకటక చైత్యం దగ్గరకు చేర్చబడిందని, ఇక్కడ బుద్ధుడు కాలచక్రమనే ధ్యాన సమాధిలో కూర్చున్న చోట "వజ్రపాణి" అనే బోధిసత్వుడు దివ్యమైన రమ్య హర్మ్యమును తన మహిమతోనే నిర్మించెనని, టిబెట్టు బౌద్ధ గ్రంధాలలో ఉంది. ఈ టిబెట్ గ్రంధాల ఆధారంగానే నాగార్జునుడికి ఇక్కడ మహాకాలతంత్రం లభించిందని గాధలు ఉన్నాయి.

శిల్పము[మార్చు]

పద్మం
తోరణాలంకరణ శిల్పం. మధ్యలో యక్షుడు. అమరావతి స్తూపం నుండి. టోక్యో నేషనల్ మ్యూజియం నుండి.
బౌద్ధమతం యొక్క త్రిరత్నాల చిహ్నం బ్రిటిష్ మ్యూజియం నుండి.
స్తూప సమూహములో భిక్షువులకు ఆవాసములు, విద్యాసంబంధిత కట్టడాలుకూడ వున్నాయి. వీటిలో చాలవరకు స్థానికుల, భక్తుల విరాళాలతో కట్టబడ్డాయి. అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". అమరావతి శిల్ప, శాసనాలవల్ల ఆ కాలము నాటి వృత్తులు, కులాలు, కుటుంబ వ్యవస్థ, ఐహిక జీవితం, స్త్రీల స్థానం, వస్త్ర సంస్కృతి, మతం, ఇతర సామాజిక స్థితులు విశదంగా వెల్లడవుతాయి. అమూల్యమైన ఈ శిల్పకళాఖండాలు కొన్ని బ్రిటిష్ మ్యూజియములో చూడవచ్చును[8].
శిల్ప దశలు: అమరావతి స్తూపం నిర్మాణంలో వివధ దశలున్నట్లే శిల్పరీతులలోను వివిధ సాంప్రదాయాలు గోచరిస్తాయి. మొదటి దశలోని శిల్పంలో బుద్ధుని కథావిన్యాసము సంగ్రహంగా చూపబడింది. అనగా సామాన్య జనులకు బుద్ధుని గురించి, అతని బోధలగురించి అవగాహన కలిగించడానికి బుద్ధుని కథలు సంకేత రూపంగా చెప్పబడ్డాయి. ఉదాహరణకు బుద్ధుని జననాన్ని పద్మంతోను, మహాభినిష్క్రమనాన్ని గుఱ్ఱంతోను, సంమ్యక్సంబోధిని బోధివృక్షంతోను, బోధనను ధర్మచక్రంతోను - ఇలా చూపారు. అప్పటికి ఇంకా బౌద్ధమతంలో సాహిత్యం, శిల్పం పూర్తిగా ప్రభవించలేదు గనుక శిల్పులు తమ సంకేతాలను తామే రూపొందించుకోవలసివచ్చి ఉండవచ్చును. తరువాతి కాలంలో చెక్కబడిన శిల్పాలు మరింత మనోహరమైనవి.

దేశీయం: అమరావతి శిల్పకళ ప్రధానంగా దేశీయమైనది. గ్రీకు శిల్పకళ గురించి అమరావతి శిల్పులకు పరిచయమున్నట్లు అనిపిస్తుంది. కాని బుద్ధ విగ్రహం మలచడంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోను ఆంధ్రదేశపు శిల్పుల ప్రత్యేకత, నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీ ప్రతిమలను చెక్కడంలో అమరావతి శిల్పి స్వేచ్ఛ, కళానిపుణత అద్భుతమైనవి. కొన్నిచోట్ల నగ్నంగా స్త్రీలను చెక్కినా గాని, ధార్మిక భావనకు భంగం వాటిల్లకుండా, బుద్ధుని గాధతో వాటికి సంబంధం లేకుండా చెక్కారు. [3]

సంగీతం, నృత్యం: సంగీత, నృత్య కళాసంబంధమైన శిల్పాలు కూడా అమరావతి శిల్పాలలో చాలా ఉన్నాయి. అనేక విధాలైన వాయిద్యాలు, భంగిమలు ఉన్నాయి. వేణువు, తాళములు, ఒక విధమైన వీణ (Harp), సితారు. తాళపుచిప్పలు, మృదంగము, తబలా, ఢక్కి, ఖంజిర, తప్పెటలు, వీరణము - ఇలా ఎన్నో వాయిద్యాలు శిల్పాలలో ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో వాడే Harp అమరావతి శిల్పాలలో అతి సాధారణంగా కనిపించడం ఒక విశేషం.

జీవనం: ప్రజల జీవనానికి, ప్రధానంగా క్షాత్ర జీవనానికి చెందిన అనేకానేక శిల్పాలు అమరావతిలో కనిపిస్తాయి. సైన్యము, రథములు, గుఱ్ఱములు, ఆయుధాలు, మరియు ఆయుధ ధారుల వేషభూషాలు - ఇటువంటి చాలా సమాచారం అమరావతిఒ శిల్పాలద్వారా తెలుస్తున్నది. ధనుస్సు, బాణము, ఈటె, ఖడ్గము, డాలు, చక్రము, బల్లెము వంటి ఆయుధాలనుపయోగించేవారని తెలుసుకోవచ్చును. ఒంటెలను కూడా యుద్ధాలలో వాడినట్లు చూపడం మరొక విశేషం.

అలాగే వివిధములైన వేష భూషాదులను, శిరోజాలంకరణ పద్ధతులను అమరావతి శిల్పాలలో గమనించవచ్చును. సామాన్యులు, ప్రభువులు, భిక్షుకులు, ఆడువారు, మగవారు - ఇలా ఒకో రకం ప్రజలు వేసుకొనే దుస్తులు, ధరించే ఆభరణాలు, చేసికొనే అలంకారాలు ఈ శిల్పాల కారణంగా మనకు తెలుస్తున్నాయి. అమరావతి శిల్పాలలోని స్త్రీమూర్తులను గమనించినట్లయితే ఆ కాలపు స్త్రీలు సౌందర్య, శృంగారములమీద ఎంతటి శ్రద్ధ వహించేవారో అని ఆశ్చర్యం కలుగక మానదు.

కట్టడాలు: అప్పటి కట్టడాలు, ద్వార తోరణాలు, గడ్డితో కప్పిన గుడిసెలు, రాజ భవనాలు, ఇటుకలతో కట్టిన గోడలు, మేడలు, మిద్దెలు - ఇవన్నీ అమరావతి శిల్పాలలో చూడవచ్చును. ఉద్యానవనాలలో చలువరాతి వేదికలుండేనవి, నాటిలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించేవారని తెలుస్తున్నది. పెద్ద భవనాలకు చిత్రవిచిత్రమైన అలంకారాలతో కూడిన పెద్దపెద్ద ద్వారాలుండేవి. బౌద్ధభిక్షువులుండే కట్టడాల నిర్మాణాలలో వారి జీవనానికి అనుకూలమైన అమరికలను, విభాగాలను గమనించవచ్చును.

"ఆమరావతి శిల్పము ఆంధ్రభూమిని కళామయము చేసి ఆంధ్రులకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించినది. ఆధునిక సభ్యతా సంస్కృతులు, సౌందర్యాలంకార విషయమున కలిగించిన ప్రతి పరిణామము ఇప్పటికి షుమారు రెండువేల యేండ్ల క్రిందనే విలసిల్లిన అమరావతికళలోనే గోచరించుట ఆశ్చర్యకరము."[3]
కొన్ని శిల్పాల రేఖాచిత్రాల ప్రదర్శన

అమరావతి శిల్పరీతి[మార్చు]

సంబోధి
కళాక్షేత్రంగా అమరావతి ఆర్జించిన కీర్తి అద్భుతమైనది. వీటి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట.[4]. అమరావతి శిల్ప కళారీతి (Amaravati school of art) శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని విర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం. [9].

డా. ఉల్రిక్ వాన్ ష్రోడర్ (Dr. Ulrich Von Schroeder) అనే అధ్యయనకారుడు శ్రీలంకలోని బౌద్ధ శిల్పంపై కూలంకషమైన మౌలిక పరిశోధన చేసి తన అధ్యయనాన్ని విస్తారమైన ఆధారాలతో ప్రచురించాడు. శ్రీలంక లంకలోని వవిధ నిర్మాణాలలోని సున్నపురాయి శిల్పాలను వాటి కొలతలతో సహా జాబితా తయారు చేశాడు. అతని ప్రచురణలోని అధ్యాయాల పేర్లు "ప్రారంభ అమరావతి రీతి కాలంలో దిగుమతి అయిన శిల్పాలు" (Imported Sculptures from Early Amaravati School) మరియు "అనంతర అమరావతి రీతి (నాగార్జున కొండ) కాలంలో దిగుమతి అయిన శిల్పాలు" (Imported Sculptures from late Amaravati (Nagarjunakonda)). దీన్నిబట్టి అమరావతి, నాగార్జునకొండలలోని శిల్పులు శ్రీలంకకు, ఇతర దక్షిణాసియా దేశాలకు బౌద్ధ, ఇతర శిల్పాలను ఎగుమతి చేస్తుండేవారని స్పష్టంగా తెలుస్తున్నది.

వ్యాపార వర్గాల మధ్య సంబంధాలు, అనుబంధాలు నెలకొనడానికి మతైక్యత ఒక ముఖ్యమైన సాధనంగా పని చేస్తుంది. ఈ విధంగానే బౌద్ధ, హిందూ శిల్పాలు ఆగ్నేయాసియా, శ్రీలంక వంటి ప్రాంతాలకు ఎగుమతి అవడం సుగమం అయి ఉండవచ్చును.[10] సెలెబస్‌లోని సెంపాంగా (Sempaga in Celebes)లో అమరావతి రీతిలోని కంచు బుద్ధవిగ్రహం లభించింది. సియాంలోని డోగ్-డువోంగ్.డోంగ్‌టక్ (Dong-Duong. Dong Tuk (Siam))లోని ప్రారంభకాలపు శిల్పాలు అమరావతి రీతిలో చెక్కబడ్డాయి. సెలెబస్ పశ్చిమ తీరంలోని దక్షిణ జెంబర్ (South Djember) మరియు సికెందంగ్ (Sikendeng) లోని కంచు బుద్ధవిగ్రహం, బుకిట్ (Bukit) లోని పెద్ద బుద్ధ విగ్రహం పూర్తిగా అమరావతి శిల్ప రీతులలో ఉన్నాయి. ఇవి ఆంధ్ర ప్రాంతంనుండి వలస వచ్చినవారు తెచ్చి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే పాలెంబాంగ్ (Palembang) అనబడే చోట ఉన్న చాలా పెద్ద రాతి బుద్ధ విగ్రహం రవాణా చాలా కష్టమై ఉండాలి. ఈ ద్వీపకల్పంలో ఇది అన్నింటికంటె పాతదనిపించే అమరావతి శిల్పం. మచిలీపట్నం, ఘంటసాల వంటి రేవు పట్టణాల ద్వారా ఇండినేషియాకు అమరావతి శిల్పులతో సంబంధాలు వర్ధిల్లి ఉండాలి

అమరావతి శిల్పచిత్రాలు వాటి యీగ్యత వల్లనే దిగంత విశ్రాంతములయినవి. భారతీయ శిల్ప కళావిన్యాసంలో "అమరావతి రీతి" అనే పేరు మీద ఒక విశిష్ట కళా విభూతికి సూత్రములు పన్నిన ప్రాచీనాంధ్ర శిల్పాచార్యులు రచించిన కృతుల గొప్పదనానికి అమరావతి, జగ్య్యపేట, నాగార్జునకొండ వంటి చోట్ల బయటపడిన భగ్న శిల్ప శిధిలాలే నిదర్శనాలు. [2]

శాసనాలు[మార్చు]

ధాన్యకటకములో లభించిన శాసనాలు ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలోలభించాయి. ఈ శాసనాలు బ్రాహ్మీ, ఇతర లిపులలో ఉన్నాయి. వీటిలో చాలావరకు దాన శాసనాలు. శాసనాలలో తెలుగు లిపి పరిణామక్రమంలో నాలుగు దశలు గుర్తించవచ్చు.
వివిధ దశలకు చెందిన కొన్ని అమరావతి స్తూపాలు
  • మొదటిదశ: అశోకుని పూర్వపు బ్రాహ్మీ లిపి భేదం. థి, స, పా, త అనే అక్షరాలు ఉన్న పాత్ర లభించింది. ప్రాకారం ఆగ్నేయ దిశలో లభించిన ఒక మౌర్య లిపి శాసనం ప్రకారం క్రీ.పూ. 200 నాటికే ఈ మహా చైత్యం ఉన్నట్లు స్పష్టమౌతున్నది.
 " ...... ....... సెనగపస ముడకుతలస ధభో .........."
 (......... సేనాధిపతియగు ముడకుతలుని (ముడుకుంతలుని) స్తంభము .......)
గుంటూరు జిల్లాలోనిదే అయిన భట్టిప్రోలు స్తూపం ధాతుకరండం శాసనాలు మాత్రమే అమరావతి లిపికి దగ్గఱగా కానవచ్చే మొదటి శాసనాలు. భట్టిప్రోలు శాసనాలనుబట్టి బ్రాహ్మీలిపి కృష్ణానదీప్రాంతంలో క్రీ.పూ.3వ శతాబ్ది (ఆశోకునికి పూర్వమే) వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాని అమరావతి లిపిలోని ద, ధ, భ, చ, జ, ష, ళ వంటి కొన్ని అక్షరాలు అశోకుని కాలపు లిపికి దగ్గఱగా ఉన్నాయి.[3].
  • రెండవ దశ: క్రీ. పూ. 1వ శతాబ్ది నుండి క్రీ.శ. 2వ శతాబ్దిమధ్యకాలం. ఈ శాసనాల లిపిలో అన్ని అక్షరాలకు తలకట్టులు సమానంగా ఉన్నాయి.
  • మూడవ దశ: క్రీ.శ. 2-3 శతాబ్దకాలం; పడమటి దక్కను, కొంకణ దేశపు గుహలలోని లిపులతో పోలికలున్నాయి.
  • నాలుగవ దశ: క్రీ.శ. 3-4 శతాబ్ది ఇక్ష్వాకుల కాలం లిపి పరిణామాన్ని సూచించే శిలాఖండం లభించింది. ఇక్ష్వాకురాజు శ్రీవీరపురుషదత్తుని జగ్గయ్యపేట శాసనపు లిపిని పోలి ఉంది.
అమరావతి శాసనాలలో వాడిన భాష ప్రాకృతం. దీనికి, వ్యాకరణ శాస్త్రజ్ఞుల పైశాచీప్రాకృతానికి దగ్గరి సంబంధం ఉంది. కాశ్మీరదేశ గాధననుసరించి పైశాచీప్రాకృతమున బృహత్కథను రచించిన గుణాఢ్యుడు ఆంధ్రరాజస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు. ఆ గాధనుబట్టి ఆంధ్రరాజ్యమున పైశాచి భాషలో కృషి జరుగుతున్నట్లు ఊహించడానికి ఆస్కారం ఉంది.
ఈ శాసనాలలో రాజవంశములకు (చరిత్రకు) సంబంధించిన విషయాలు ఏమీ తెలియడంలేదు. ఆంధ్ర రాజులలో వాసిష్ఠీపుత్ర శ్రీ పుళుమావి, శివశ్రీశాతకర్ణుల శాసనాలు మాత్రమే లభిస్తున్నాయి. ఆచార్య నాగార్జునుని మిత్రుడు అయిన ఆంధ్రరాజు వాసిష్ఠీపుత్రుడేనని, నాగార్జునుని ప్రోత్సాహంతో ఆంధ్రరాజులు ఈ మహానిర్మాణానికి మరిన్ని సొబగులు అందించారని భావించవచ్చును.

క్షీణత[మార్చు]

క్రీ.శ. 1344 వరకు ఇక్కడ పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. ఈ స్తూపం కోల్పోయిన వైభవం గురించి సుప్రసిద్ధ చరిత్ర కారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ ఇలా వ్రాశాడు[2].
అచిర కాలముననే ధాన్యకటకమునకా మహా దశ తొలగిపోయినది. మహాచైత్యము ప్రభ క్రీ.శ. నాలుగైదు శతాబ్దులవరకు వెలిగినది. బ్రాహ్మణ మతాభిమానులయిన పల్లవులు, చాళుక్యులు, వాకాటకులు వంటి రాజుల కాలంలో ఆశ్రయమొసగి పోషించేవారు లేక దక్షిణాపధంలో బౌద్ధము క్రమముగా క్షీణ దశకు వచ్చెను. క్రీ.శ. 7వ శతాబ్దిలో చీనా యాత్రికుడయిన యువాన్ చువాంగ్ ధాన్యకటకమును సందర్శించునాటికే బౌద్ధము దుర్దశలోనున్నది. బౌద్ధవిహారములనేకములు భిక్షుసంఘ పరిత్యక్తములయి, జన శూన్యములయి పాడువారి యుండినవి. ఇరువది విహారములందు మాత్రము బౌద్ధ సాంఘికులు నివశించుచుండిరి. వారయినను వేయిమందికెక్కువ లేరు. అప్పటికి హిందూ దేవాలయములనేకములు ప్రతిష్ఠితములయినవి. అయినను ఆ మహానగరమునకు విద్యాపీఠమను యశస్సు కుంచితము కాలేదు.
బౌద్ధమతావసాన దశలో తాంత్రక పద్ధతి ప్రబలమయి తన విశిష్టతను కోల్పోయినది. క్రీ.శ. 11వ శతాబ్దము వరకు జానపదులు భక్తి ప్రేరితులయి ఎడనెడ పుష్పాంజలులు సమర్పించుచు వచ్చినను, మతమను మబ్బుతెర దిగజారినమీదట నది ఉత్కృష్ట శిల్పకళాభిజ్ఞతకు అపూర్వమైన ఉదాహరణగా మాత్రమే పొలుపారి, కాల విపర్యమున శిధిలమయి భూగర్భస్తమయినది. ... దీప సహస్రాలంకృతమయి, బుద్ధ దేవుని జయంత్యుత్సవములకును, ఇతర బౌద్ధ వర్ధంతులకును దేశాంతరములనుండియు, ద్వీపాంతరములనుండియు వేలకొలది బౌద్ధ భక్త బృందమును ఆకర్షించుచు నయన పర్వము కావించుచుండిన ఈ మహాచైత్యము విలసిల్లిన క్షేత్రము ఆ మహావిభూతి యెల్ల హరించిపోవగా "దీపాలదిన్నె" అనే నామధేయమును మాత్రమే పరిశిష్టముగ నిలుపుకొని "బ్రతికిచెడ్డ యాంధ్రుల పూర్వవైభవంబు"ననేక శతాబ్దులనుండి కన్నీరు మున్నీరుగ వర్ణించు మనోవాహిని కృష్ణవేణీ స్రవంతిలో శ్రుతి కలిపి నేటికిని హృదయవిదారణముగ విషాదగీతి నాలపించుచునే యున్నది.